Home South Zone Andhra Pradesh భోగి సంబరాల్లో వైసిపి నేత దేవినేని అవినాష్

భోగి సంబరాల్లో వైసిపి నేత దేవినేని అవినాష్

0

భోగి పర్వదినం సందర్భంగా ఎన్టిఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో బుధవారం (14-01-2026) నియోజకవర్గ సమన్వయకర్త *దేవినేని అవినాష్* ఆధ్వర్యంలో సంప్రదాయ బద్దంగా భోగి మంటలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.

రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్న మెడికల్ కాలేజ్ ప్రైవేటికరణ జి.వోను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ 17 వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామి రెడ్డి, మాజీ కార్పొరేటర్, వైసీపీ రాష్ట్ర నాగవంశం విభాగం అధ్యక్షుడు బొడ్డు అప్పల నాయుడు, వివిధ హోదాల నాయకులు.

మహిళ నాయకురాలు అందరు కలసి *దేవినేని అవినాష్ గారికి భోగి శుభాకాంక్షలు💐 తెలియజేసి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా *అప్పల నాయుడు* మాట్లాడుతూ సూర్య భగవానుడు ఆశీస్సులతో రాష్ట్రంలో ప్రతి ఇంట భోగి భోగభాగ్యాలు, సిరిసంపదలు నింపాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు.

NO COMMENTS

Exit mobile version