Home South Zone Andhra Pradesh రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సంక్రాంతి శుభాకాంక్షలు

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సంక్రాంతి శుభాకాంక్షలు

0

తాడేపల్లి.

మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ఒక ప్రతీక అని ఆయన అన్నారు.

భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో ఎనలేని సంక్రాంతి శోభను తీసుకువచ్చాయన్న శ్రీ వైయస్‌ జగన్‌.. ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

NO COMMENTS

Exit mobile version