విజయ డైరీ ని మరింత ఆధునీకరించాలి.. డైరీ లో భోగి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే సుజనా..
పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి బుధవారం ఉదయం చిట్టినగర్ లోని విజయ పాల డైరీ ను సందర్శించారు..l
మిల్క్ ప్రాజెక్ట్ లో ఏర్పాటుచేసిన సంక్రాంతి సంబరాలలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి పాల్గొన్నారు. అక్కడ గోమాతకు పూజలు నిర్వహించిన అనంతరం కురియన్, కాకాని వెంకటరత్నం, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విజయ డైరీ యాజమాన్యంతో కలిసి ప్లాంటును సందర్శించారు. పాల ద్వారా పాల ప్యాకెట్లను తయారు చేసే విధానంతో పాటు, పాల ఉత్పత్తులు తయారు చేసే ప్లాంటును ఆయన క్షున్నంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ భోగి పండుగ సందర్భంగా విజయ డైరీలో గోమాతకు పూజలు నిర్వహించామని చెప్పారు. అనంతరం ప్లాంటుని కూడా సందర్శించినట్లు తెలిపారు.
ప్రజలకు నాణ్యమైన పాల ఉత్పత్తులను అందించే విషయంలో నాణ్యత ప్రమాణాలు బాగున్నాయని, అయితే ప్లాంటు ను మరింత ఆధునీకరించాలని ఆయన యాజమాన్యానిక్కి సూచించారు..
అనంతరం విజయ డైరీ చైర్మన్ జలసాని ఆంజనేయులు మాట్లాడుతూ పాడి రైతుల కుటుంబాలతో నడుపుతున్న విజయ డైరీ తరపున ఆయన రాష్ట్ర ప్రజలకు నగర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి తమ ప్లాంట్ ను సందర్శించారని పలు సూచనలు కూడా అందించారని వాటిని తాము అమలు పరుస్తామని తెలిపారు….
కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, రెడ్డిపల్లి రాజు, మరియు డైరీ సిబ్బంది పాల్గొన్నారు..
