తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి : మంత్రి ఆనం*
అందరికీ సకల శుభాలు కలగాలి*
రాష్ట్ర ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి*.
నెల్లూరు, జనవరి 13: తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి సకల శుభాలు అందించాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఆకాంక్షించారు.
భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వదినాలను పురస్కరించుకుని మంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్థిల్లాలని, రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి అన్నదాతలు పాడి పంటలు,బోగ భాగ్యాలు,సిరి సంపదలతో తుల తూగాలని, అందరి కుటుంబాలలో ఆనందం వెల్లి విరియాలని రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి, ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలందరిపై, రాష్ట్రాన్ని సుపరిపాలన వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పై, రాష్ట్ర ప్రభుత్వంపై ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు-




