దేశంలో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ ప్రాజెక్టుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించిన ఆర్థిక సంవత్సరం 2026– 28 రోడ్‌మ్యాప్ ప్రకారం, దేశవ్యాప్తంగా రూ. 17 లక్షల కోట్ల విలువైన 852 ప్రాజెక్టులను చేపట్టనుండగా, అందులో ఏపీ ఏకంగా రూ. 1.16 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
మౌలిక సదుపాయాల వృద్ధిలో రాష్ట్రం చూపిస్తున్న చొరవకు ఈ గణాంకాలే నిదర్శనం.
