నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్*
నారావారిపల్లె: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబునాయుడు, కుటుంబ సభ్యులతో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను తిలకించారు. అనంతరం స్థానికంగా వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులతో నిర్వహించిన క్రీడా పోటీలను వీక్షించారు.
క్రీడా పోటీలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినీ, విద్యార్థులకు సీఎం నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో భాగస్వాములైన ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని ఘనంగా సన్మానించారు.
విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి, తేజస్విని, ఎంపీ శ్రీ భరత్, నారా రోహిత్, నారా, నందమూరి కుటుంబ సభ్యులతో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు తదితరులు పాల్గొన్నారు




