పల్లె పండుగతో గ్రామాలకు సరికొత్త సంక్రాంతి శోభ*
*జిల్లాలో పల్లె పండుగ ద్వారా గ్రామాల అభివృద్ధికి రూ. 318 కోట్లు మంజూరు*
*రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి*
➖ నూతన రోడ్లు, తాగునీటి పథకాలు, మౌలిక వసతులతో ముస్తాబవుతున్న పల్లెసీమలు
➖ గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ రాష్ట్రాన్ని సుపరిపాలన వైపు పయనింప చేస్తున్నాం
➖ ఎవరు ఊహించని విధంగా సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశాం
➖ దగదర్తి ఎయిర్పోర్ట్, రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులతో నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక ప్రగతి
➖ సోమశిల హై లెవెల్ కెనాల్ మొదటివిడత పూర్తి కి కృషి చేస్తున్నాం
➖ ప్రతి పథకాన్ని కూడా మర్రిపాడు మండలానికి తీసుకొస్తున్నాం
➖ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
➖ఆత్మకూరు నియోజకవర్గం లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి ఆనం
*విపిఆర్ అమృత ధార తో గ్రామీణ ప్రాంతాల దాహార్తి తీరుతోంది : ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి*
*ఆత్మకూరు, జనవరి 13 :*
*రాష్ట్రవ్యాప్తంగా తమ ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమంతో గ్రామాలకు సరికొత్త సంక్రాంతి శోభను తీసుకొచ్చిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు.*
మంగళవారం ఉదయం ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి ఆనం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
అనంతసాగరం మండలం ఎగువపల్లి, మర్రిపాడు మండలం రాజుపాలెం, ఏఏస్‌పేట మండలం మదరాబాదు, కావలియడవల్లి, సంగం మండల కేంద్రంలో, చేజర్ల మండలం ఎన్‌వి కండ్రిగలో విపిఆర్ అమృతధార వాటర్‌ప్లాంట్లు, సిమెంటురోడ్లను మంత్రి ఆనం, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు
ఈ సందర్భంగా మర్రిపాడు మండలం రాజుపాలెం గ్రామంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో గ్రామాల్లో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ ఒక్కరోజే ఆరు ప్లాంట్లను ప్రారంభించామని, మొత్తం ఆత్మకూరు నియోజకవర్గం లో ఇప్పటివరకు 27 ప్లాంట్లను వేమిరెడ్డి సొంత నిధులతో నిర్వహిస్తూ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి అందించడం పట్ల వేమిరెడ్డి సేవాభావాన్ని కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వం పల్లె పండుగ పేరుతో ప్రతి గ్రామంలో కూడా రహదారులు, మౌలిక వసతుల కల్పనకు పెద్దఎత్తున నిధులు మంజూరు చేసిందని చెప్పారు. పల్లె పండుగ ద్వారా నెల్లూరు జిల్లాలో 318 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 567 సీసీ రోడ్లకు 36.12 కోట్లకు నిధులు వెచ్చించామన్నారు.
172 గోకులాల నిర్మాణాలు చేస్తున్నామన్నారు. అనంతసాగరం మండలంలో 79 సిసి రోడ్లకు 5.47 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆత్మకూరు నియోజకవర్గం లో జల్జీవన్ మిషన్ ద్వారా 335 పనులకు 66 కోట్లు నిధులు మంజూరైనట్లు చెప్పారు. పశు సంపద అభివృద్ధి కోసం పశువుల షెడ్లతోపాటు పాటు క్యాటిల్ హాస్టల్స్ కూడా మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, పల్లె పండుగ అభివృద్ధి పనులు గ్రామాలకు సరికొత్త సంక్రాంతి వెలుగులు తీసుకొచ్చాయని మంత్రి ఆనం చెప్పారు.
నెల్లూరు జిల్లాలో దగదర్తి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 487 ఎకరాలకు నిధులు మంజూరు అయినట్లు చెప్పారు. 900 కోట్లతో విమానాశ్రయాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులతో ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని కూడా మర్రిపాడు మండల అభివృద్ధి కోసం వినియోగిస్తున్నట్లు చెప్పారు. సోమశిల హై లెవెల్ కెనాల్ మొదటి విడత పనులు పూర్తి చేసి మెట్ట ప్రాంతాలను చేస్తామని ఈ సందర్భంగా ఆనం పునరుద్ఘాటించారు.
శ్రీవాణి ట్రస్టు ద్వారా ప్రజల ఆకాంక్షల మేరకు గ్రామాల్లో దేవాలయాలను నిర్మించేందుకు త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 150 ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. 5870 ఆలయాల్లో ధూపదీప నైవేద్యం పథకం ద్వారా ప్రతినెల 10వేలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. 1058 పురాతన ఆలయాల్లో పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టినట్లు చెప్పారు.
ఎవరూ ఊహించని విధంగా సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేశామని మంత్రి ఆనం తెలిపారు. ప్రజలపై భారం పడకుండా ఆర్టీసీకి ప్రభుత్వం కోట్ల రూపాయలు చెల్లిస్తూ ఉచిత బస్సు, స్త్రీ నిధి పథకాలను అమలు చేస్తోందన్నారు. అన్నా క్యాంటీన్ల ద్వారా ఇప్పటివరకు నాలుగు కోట్ల మందికి భోజనం అందించామని, కోట్లాది రూపాయలతో పింఛన్లు క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్నామని చెప్పారు.గ్యాస్ సంస్థలకు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తూ ప్రజలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని చెప్పారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తరలివస్తున్నాయని, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తున్నామని అన్నారు.
త్వరలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తామని, పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ పేరుతో గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో చేసిన 10 లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ… ఆర్థిక భారాన్ని మోస్తూ తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకానికి సుపరిపాలన అందిస్తోందని చెప్పారు.
*విపిఆర్ అమృత ధార తో గ్రామీణ ప్రాంతాల దాహార్తి తీరుతోంది*
*ప్రజలు సంతోషపడేలా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి*
*ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి*
ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో 6 వాటర్ ప్లాంట్లను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 2017 నుంచి ఇప్పటి వరకు పెట్టిన అన్ని ప్లాంట్ల ను నిర్వహిస్తున్నామని వివరించారు. ఆత్మకూరులో 27 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. పండుగ పూట ఇళ్లకు వచ్చిన అందరికి ఈ ప్లాంట్స్ ఉపయోగపడతాయని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి సారధ్యంలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని అన్నారు. ప్రతి చోటా ప్రజలు సంతోషపడేలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో పావని, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
