Wednesday, January 14, 2026
spot_img
HomeSouth ZoneTelanganaమంటలు రేపిన మెయిన్ ఆర్ యు బి - బిజెపి బీఆర్ఎస్ కార్యకర్తల రచ్చ ....

మంటలు రేపిన మెయిన్ ఆర్ యు బి – బిజెపి బీఆర్ఎస్ కార్యకర్తల రచ్చ . |

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  స్థానిక ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. గేటు వద్ద గంటల కొద్ది వేచి ఉండే అవసరం లేకుండా సులభమైన మార్గం ఉద్దేశించి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి (RUB) నిర్మాణ పనులకు అధికారికంగా శంకుస్థాపన జరిగింది.

ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మధ్య మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం (గొడవ) చోటు చేసుకుంది.

క్రెడిట్ వార్.. ఈ పనులకు ఎవరు ఎక్కువ కృషి చేశారనే విషయంలో మాటల యుద్ధం జరిగింది. పనుల పరిశీలన సమయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వాదించుకున్నారు.
అండర్ బ్రిడ్జి పనులు ఆలస్యం కావడానికి కారణం గత ప్రభుత్వమే అని ఒకరు, ప్రస్తుత అధికారుల నిర్లక్ష్యం అని మరొకరు పరస్పరం ఆరోపించుకున్నారు.

గత ప్రభుత్వ హయంలోనే పనులు ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే వాదించగా, కేంద్రం నుండి రైల్వే నిధులు తానే తీసుకువచ్చానని ఈటెల స్పష్టం చేశారు.

వివరాల్లోకి వెళితే.. అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం (జనప్రియ అపార్ట్మెంట్స్) వద్ద RUB నూతన బ్రిడ్జి నిర్మాణ పనులకు భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇతర నేతలు పాల్గొని ఈ పనులకు భూమి పూజ నిర్వహించారు.

ఈ అండర్ పాస్ అందుబాటులోకి వస్తే మచ్చ బొల్లారం పరిసర ప్రాంతాలవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. అత్యవసర సమయాల్లో అంబులెన్సులు, పాఠశాల బస్సులు గేటు వద్ద ఆగకుండా వెళ్లిపోయే వీలు కలుగుతుంది.

ఈ ప్రాజెక్టును కోట్లాది రూపాయల వ్యయంతో రైల్వే శాఖ నిధులతో ఈ RUB ని నిర్మిస్తోంది. నిర్ణీత గడువులోగా పనులు  పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
కార్యక్రమం సజావుగా సాగుతున్నప్పటికీ, కార్యక్రమ క్రెడిట్ విషయంలో  స్థానిక ఎంపీ, మరియు ఎమ్మెల్యే వర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకోవడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. కాసేపు గందరగోళం ఏర్పడింది.

పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింప చేశారు.
తర్వాత కార్యక్రమం సజావుగా సాగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

#sidhumaroju

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments