Wednesday, January 14, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshవిజయవాడ గొల్లపూడి లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

విజయవాడ గొల్లపూడి లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

గొల్లపూడిలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు*
భోగి మంటలు అంటేనే చెడును విడిచి మంచిని ఆహ్వానించడం
తెలుగు ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు
సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి*

గత ప్రభుత్వంలో జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలతో రైతులు ఎదుర్కొన్న క్షోభను త్యజించి వాటిని సంక్రాంతి భోగి మంటల్లో వేసి కొత్త ఆశలకు నాంది పలుకుతున్నారని సమాచార, పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి వేడుకలు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని గొల్లపూడి వన్ సెంటర్ వద్ద అత్యంత అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం తెల్లవారుజామున నిర్వహించిన భోగి వేడుకల్లో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ.. రైతుల జీవితాల్లో అనిశ్చితి, అవమానాలకు కారణమైన పాత పట్టాదారు పాసుపుస్తకాలను త్యజించి, ప్రభుత్వం రాజముద్రతో జారీ చేస్తున్న నూతన పట్టాదారు పాసుపుస్తకాలను స్వీకరించడం రైతులు ఆనందంతో ఉన్నారన్నారు. భోగి మంటలు అంటేనే చెడును విడిచి మంచిని ఆహ్వానించే సంప్రదాయానికి ప్రతీక అని అన్నారు. అదే భావంతో రైతులు తమ బాధాకర అనుభవాలకు ముగింపు పలుకుతూ కొత్త నమ్మకం, భరోసాతో ముందుకు సాగుతున్నారని మంత్రి పేర్కొన్నారు.

రైతుల శ్రేయస్సే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యంగా ముందుకు వెళ్లుతుందన్నారు. సంక్రాంతి పండుగకు వేలాది మంది ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకి వచ్చి పండుగ చేసుకుంటారన్నారు. గత ప్రభుత్వంలో రైతులు చాలామంది రైతులు పట్టాదారు పుస్తకాల విషయంలో క్షోభ పడ్డారన్నారు. రైతుల ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం రాజముద్రతో కొత్త పట్టాదారు పుస్తకాలు అందిస్తుందన్నారు. రైతులు పాత పట్టాదార్ పాస్ పుస్కకాలను బోగి మంటల్లో వేసి పండుగ జరుపుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంచి పాలనను అందిస్తున్నారన్నారు.

ధాన్యం డబ్బులను 24 గంటల్లో రైతు ఖాతాల్లో వేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు.. రాష్ట్రంలో యువతీయువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొస్తుందన్నారు. తెలుగు ప్రజల జీవితాల్లోని కష్టాలు భోగి మంటల్లో దగ్దమై, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, శాంతి సమృద్ధి వెల్లివెరియాలని ఆకాంక్షించారు.. అందరి మనోభావాలను గతంలో దెబ్బతీసారని.. అలాంటి ఆలోచనలు మంటల్లో కాలిపోవాలని ఆశిస్తున్నానని మంత్రి కొలుసు పార్థసారధి తెలియజేసారు.

శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రజలందరూ శాంతి, సుస్థిరతలతో సంక్రాంతి జరుపుకుంటున్నారు. భోగి మంటల్లో పాత పుస్తకాలను వేసి భోగి పండుగను జరుపుకుంటున్నారన్నారు. మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని, ప్రతి కుటుంబంలో పండుగ వెలుగులు నిండాలని శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ ఆకాంక్షించారు.

ముందుగా గొల్లపూడి వన్ టౌన్ సెంటర్ లో మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ లు కలిసి సంప్రదాయబద్ధంగా భోగి మంటలను వెలిగించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments