విజయవాడ
వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్
– రెండేళ్లు కావొస్తున్నా మహాశక్తి పథకానికి అతి గతి లేదు.
– పండుగల పేరు చెప్పి కాలయాపన తప్పా మహిళా సాధికారితపై కమిట్మెంట్ లేదు.
– పథకం కావాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని ఒకరూ..
– మహిళలు రెడీగా ఉండమని మరొకరు..
– దీపావళి, సంక్రాంతికి ఇస్తామని ఇంకొకరు ఆడబిడ్డల మనోభావాలతో ఆటలాడుతున్నారు.
– ఆడబిడ్డ నిధి పేరుతో కోటిన్నర మంది రాష్ట్ర మహిళలకు సీఎం చంద్రబాబు గారు చేసింది ఘరానా మోసమే.
– నెలకిచ్చే 15 వందలతో 15 వేలు చేస్తాం అన్నారు.
– 15 వేలను లక్షా 50 వేలకు ఆదాయం పెంచే మార్గం చూపుతాం అన్నారు.
– మహిళల అభివృద్ధికి పెద్దపీట అంటూ చెప్పినవన్నీ పచ్చి బూటకపు మాటలు.
– సూపర్ సిక్స్ హామీల్లో ఆడబిడ్డ నిధి ప్రధాన హామీ.
– 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు ఆర్థికంగా బరోసా నిచ్చే హామీ .
– ప్రతి ఏడాది 18 వేలు లబ్ధి చేకూరే పథకానికి రెండేళ్లుగా పంగనామాలు పెడుతూ ..
– సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకోడానికి కూటమి ప్రభుత్వానికి సిగ్గుండాలి .
– ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటినుంచి అమలు చేస్తారో చెప్పండి.
– నచ్చినప్పుడు, ఇష్టం ఉన్నప్పుడు అమలు చేసేవి కావు ఎన్నికల హామీలు.
– మహాశక్తి పథకాన్ని తక్షణం అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని..
– రాష్ట్ర మహిళల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.






