అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా నేరగాళ్లపై పోలీసులు నిఘా పెంచారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అదేశాలతో పాడుబడిన ఇళ్లు, నిర్మానుష్య ప్రాంతాలపై డ్రోన్ కెమెరాతో ఓ కన్ను వేశారు.
గంజాయి, పేకాట, ఈవ్‌టీజింగ్‌లకు ఈ కెమెరాతో చెక్ పెడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడాన్ని సైతం డ్రోన్ కెమెరాతోనే గుర్తించి ఈఛలాన్ వేస్తున్నారు. మీరు చిన్న తప్పు చేసినా ఈ డ్రోన్ కెమెరాకు దొరికేస్తారు. బీ కేర్‌ఫుల్..!




