సీపీఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు సోమవారం మాట్లాడుతూ, ప్రజల పక్షాన ఉద్యమాలు చేపట్టే కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం అప్రజాస్వామిక చర్య అని అన్నారు.
ఉద్యమకారుడు అప్పలరాజుపై పీడీ యాక్ట్ వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ మదనపల్లెలోని కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. శ్రీనివాసులు ప్రభుత్వ తప్పులను ప్రజల ముందు వెల్లడి చేయడం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.




