సత్యసాయి జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లెకు చెందిన సాయిగణేశ్, నగేశ్ అనే ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా బంధువుల ఇంటికి బైకుపై వెళ్తుండగా, కొక్కంటి క్రాస్ వద్ద గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు.




