మదనపల్లి మండలంలోని బెంగళూరు రోడ్డు, చీకిల బైలు ప్రాంతంలో పేకాట ఆడుతున్న నలుగురు జూదగాళ్లను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
పెద్ద ఎత్తున జూదం జరుగుతోందన్న సమాచారం అందడంతో ఎస్ఐ చంద్రమోహన్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి, వారి వద్ద నుంచి రూ. 1, 600 నగదును స్వాధీనం చేసుకున్నారు.
జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.
