మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 135 డివిజన్ లోని యాదమ్మ నగర్ గద్దర్ కాలనీలో రంగోలి( ముగ్గుల) పోటీలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో కాలనీలోని 200 వందల కుటుంబాలకు చెందిన మహిళలు పాల్గొని, తమ ఇంటి ముంగిట ముగ్గులతో కళాత్మకతను చాటారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అర్బన్ కార్యదర్శి చింతల మాణిక్య రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంలో మహిళల పాత్ర కీలకమని, ఇలాంటి సామూహిక వేడుకలు, ఐక్యతను పెంచుతాయని కొనియాడారు. ఈ ప్రత్యేక సందర్భంలో మిమ్మల్ని కలవడం నాకు అత్యంత ఆనందకరమని తెలియజేశారు.
ఈ ముగ్గుల పోటీలో పాల్గొని విజేతలైన ముగ్గురికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రధమ బహుమతి : కవిత. రూ.3000/-
ద్వితీయ బహుమతి : మాధవి రూ. 2000/
తృతీయ బహుమతి :పుట్టపాక చిట్టెమ్మ.రూ 1000/-
విజేతలకు ఆయన నగదు పురస్కారం అందజేశారు.
పండుగ కానుకగా కాలనీ లోని ప్రతి మహిళకు చీరలను పంపిణీ చేయడం విశేషం.
ఈ కార్యక్రమంలో… డివిజన్ అధ్యక్షులు, గోరించి సిద్ధారెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ, మైపాల్ రెడ్డి, సూర్య, కాలనీ చైర్మన్ స్వామి, ప్రెసిడెంట్ వెంకటస్వామి, ఉపాధ్యక్షులు నాయక్, సెక్రటరీ చిన్నబాబు, తదితర బిజెపి నాయకులు, అధిక సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.





