మదనపల్లి రూరల్ సర్కిల్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కురబలకోట మండలం, ముదివేడు ఎస్ఐ మధు రామచంద్రుడికి అందిన సమాచారం మేరకు, తెట్టు గ్రామం.
చింతమాకులపల్లి వద్ద దాడులు నిర్వహించి, గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని .
ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ రవి నాయక్, ఎస్ఐ మధు రామచంద్రుడు మీడియాకు తెలిపారు.
