Thursday, January 15, 2026
spot_img
HomeSouth ZoneTelanganaజర్నలిస్టుల అరెస్ట్... భారీ ఎత్తున.. నిరసన... |

జర్నలిస్టుల అరెస్ట్… భారీ ఎత్తున.. నిరసన… |

మీడియా రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్న ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను సిట్ పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్,
ఈ మేరకు బుధవారం ఆయన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కేంద్రం నుండి ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

నిబంధనలకు విరుద్ధంగా అరెస్టులు చేయడం అప్రజాస్వామికమనీ ఆయన మండిపడ్డారు. ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై వచ్చిన కథనంపై ఎలాంటి విచారణ జరపకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్టులు దొంతు రమేష్, పరిపూర్ణ చారి, సుధీర్‌లను అరెస్టు చేయడం వెనుక కుట్ర దాగి ఉంది అన్నారు.

చట్ట ప్రకారం ఇవ్వాల్సిన 41A నోటీసులను కూడా పోలీసులు విస్మరించారు.బాధ్యత యాజమాన్యానిదే: మీడియాలో వచ్చే కథనాలకు సదరు సంస్థ ఎడిటర్, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు మరియు యాజమాన్యం బాధ్యత వహించాలి. కానీ, సంస్థలో పనిచేసే జర్నలిస్టులను, ఉద్యోగులను బాధ్యులను చేస్తూ అరెస్టులు చేయడం పోలీసుల అతి ఉత్సాహానికి నిదర్శనం.

కుట్రపూరిత చర్యలు: జర్నలిజంలో 30 ఏళ్లుగా పనిచేస్తున్న వారు, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వారిని టార్గెట్ చేయడం వెనుక కుట్ర దాగి ఉంది. ఇది సామాన్య జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసే చర్య.
ముఖ్యమంత్రికి విన్నపం: తమది ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి.

పోలీసులు మరియు అధికారులు అనుసరిస్తున్న ఏకపక్ష విధానంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి. తక్షణ విడుదల: బలహీన వర్గాలకు చెందిన ఈ ముగ్గురు జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని తక్షణమే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. జర్నలిస్టుల హక్కులను కాపాడటంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments