మదనపల్లి మండలంలో గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సుమారు 55 ఏళ్ల వయసున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
సిటిఎం పరిధిలోని ఓ కల్యాణ మండపం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు గాయపడిన వ్యక్తిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.






