Home South Zone Telangana యాదమ్మ నగర్ లో ముగ్గుల ముచ్చట్లు : విజేతలకు నగదు పురస్కారం .|

యాదమ్మ నగర్ లో ముగ్గుల ముచ్చట్లు : విజేతలకు నగదు పురస్కారం .|

0

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 135 డివిజన్ లోని యాదమ్మ నగర్ గద్దర్ కాలనీలో రంగోలి( ముగ్గుల) పోటీలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో కాలనీలోని  200 వందల కుటుంబాలకు చెందిన మహిళలు పాల్గొని, తమ ఇంటి ముంగిట ముగ్గులతో కళాత్మకతను చాటారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అర్బన్ కార్యదర్శి చింతల మాణిక్య రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంలో మహిళల పాత్ర కీలకమని, ఇలాంటి సామూహిక వేడుకలు, ఐక్యతను పెంచుతాయని కొనియాడారు. ఈ ప్రత్యేక సందర్భంలో మిమ్మల్ని కలవడం నాకు అత్యంత ఆనందకరమని తెలియజేశారు.

ఈ ముగ్గుల పోటీలో పాల్గొని విజేతలైన ముగ్గురికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రధమ బహుమతి : కవిత. రూ.3000/-
ద్వితీయ బహుమతి : మాధవి రూ. 2000/
తృతీయ బహుమతి :పుట్టపాక చిట్టెమ్మ.రూ 1000/-
విజేతలకు ఆయన నగదు పురస్కారం అందజేశారు.
పండుగ కానుకగా కాలనీ లోని ప్రతి మహిళకు చీరలను పంపిణీ చేయడం విశేషం.

ఈ కార్యక్రమంలో… డివిజన్ అధ్యక్షులు, గోరించి సిద్ధారెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ, మైపాల్ రెడ్డి, సూర్య, కాలనీ చైర్మన్ స్వామి, ప్రెసిడెంట్ వెంకటస్వామి, ఉపాధ్యక్షులు నాయక్, సెక్రటరీ చిన్నబాబు,  తదితర బిజెపి నాయకులు, అధిక సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version