అర్ధరాత్రి పూట జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం
జర్నలిస్టులు, వార్త సంస్థ గాని నిరాధారమైన, అసత్య వార్త కథనాలు రాస్తే ఆ విషయంలో ఖండన కోరుకోవచ్చు
అప్పటికీ వారు స్పందించకపోతే చట్ట పరమైన చర్యలు తీసుకోవచ్చు కానీ, ఇలా అర్థరాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్టులను అరెస్టు చేయడం సరైంది కాదు.
ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్, పరిపూర్ణ చారి, సుధీర్ జర్నలిజంలో కొనసాగుతున్న సీనియర్ జర్నలిస్టులు. వీరి అరెస్టును ఖండిస్తున్నాం.
అర్ధరాత్రి పూట తీవ్రవాదుల్లా అరెస్టు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు. వెంటనే ప్రభుత్వం అరెస్టు చేసిన జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం – తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం




