Home South Zone Telangana క్షేమంగా వెళ్ళండి… క్షేమంగా రండి: మహబూబాబాద్ సి‌ఐ మహేందర్ రెడ్డి

క్షేమంగా వెళ్ళండి… క్షేమంగా రండి: మహబూబాబాద్ సి‌ఐ మహేందర్ రెడ్డి

0

మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్, రవాణా శాఖ సంయుక్త, ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ డాక్టర్ శబరీష్, ల పిలుపుమేరకు జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత మాస ఉత్సవాలు, రోడ్డు భద్రత ట్రాఫిక్ రూల్స్ నిబంధన పై ప్రతి ఒక్కరిలో అవగాహన కార్యక్రమాలు, ప్రచారం నిర్వహించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని  .

సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే కలెక్టరేట్ ప్రాంగణంలోని అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. క్షేమం ఒకటే కాదు ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు ప్రతి ఒక్కరి బాధ్యత అని అందరూ పక్కాగా పాటిస్తూ ఎదుటి వారికి కూడా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని, మనము మన కుటుంబం పిల్లలకు ట్రాఫిక్ రూల్స్ నిబంధనలపై వివరించాలని సూచించారు.

ఉద్యోగానికి లేదా ఇతర ప్రయాణాలు చేసే ముందు వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, కలెక్టరేట్లో అన్ని విభాగాల శాఖ అధికారులు వారి వారి క్షేత్రస్థాయి సిబ్బంది అందరికీ ప్రత్యేక సర్కులర్ జారీ చేసి నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

మద్యం సేవించి వాహనాలు నడపరాదని,నో పార్కింగ్ జోన్ లో వాహనాలు పార్కింగ్ చేయకూడదని, ట్రాఫిక్ సిగ్నల్స్ ,రోడ్డు భద్రత సింబల్స్ నిషితంగా పరిశీలించి వాహనం నడపాలని, అతివేగంతో ప్రయాణం చేయకూడదని, పాదచారులు రోడ్డు దాటే క్రమంలో నిబంధనలు పాటించాలని సూచించారు.

అనంతరం క్షేమంగా చేరుకోండి… క్షేమంగా జీవించండి… అనే పోస్టర్ను ఆవిష్కరించారు.ట్రాఫిక్ రూల్స్ నిబంధనలపై జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి దేశీ రామ్ నాయక్, ఉద్యానవన శాఖ అధికారి జి. మరియన్న, డిపిఆర్ఓ పి. రాజేంద్రప్రసాద్, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, మందుల శ్రీరాములు, వెంకటేశ్వర్లు, సంతోష్, ఎస్ఐలు అరుణ్ కుమార్, ప్రశాంత్, కలెక్టరేట్ సిబ్బంది ఏ.రవీందర్, నరేష్ రెడ్డి, ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version