Home South Zone Andhra Pradesh వెల్లంపల్లి ఇంట అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు |

వెల్లంపల్లి ఇంట అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు |

0

వెలంపల్లి ఇంట అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు

కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి

స్థానిక బ్రాహ్మణ వీధిలోని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నివాసం వద్ద గురువారం నాడు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గంగిరెద్దుల ఆటలు, గొబ్బెమ్మలు, కోడి పందాలు, ముగ్గులు, హరిదాసుల కీర్తనల మరియు తదితర సాంస్కృతిక కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో కలిసి మాజీ మంత్రి.

పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ తెలుగు ప్రజలకు అత్యంత ముఖ్యమైన సంక్రాంతి పండుగని, ముఖ్యంగా రైతులు పండించిన పంటలు ఇంటికి వచ్చే ఈ శుభ సమయాన్ని, మన సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహిస్తారని అన్నారు.

గంగిరెద్దులు మరియు హరిదాసుల వంటి ప్రాచీన తెలుగు సంస్కృతిని నేటి తరానికి తెలిసేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నా తమ సొంత ఊర్లకు చేరుకుని, కుటుంబ సభ్యులతో కలిసి మూడు రోజుల పాటు పండుగను జరుపుకోవడం మన సంప్రదాయంలోని గొప్పతనమని, ఈ వేడుకల్లో వారి కుమార్తెలు, అల్లుళ్లు మరియు మనవరాళ్లతో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.

ప్రజలందరూ అమ్మవారి ఆశీస్సులతో అభివృద్ధి చెందుతూ, ప్రతి ఇల్లు సిరిసంపదలతో మరియు సుఖసంతోషాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

NO COMMENTS

Exit mobile version