చిన్న సినిమాల విజయం చిత్రసీమకు శుభపరిణామం : ఎంపీ కేశినేని శివనాథ్*
విజయవాడ లో ‘నారీ నారీ నడుమ మురారీ’ మూవీ సక్సెస్ మీట్*
ముఖ్యఅతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ హాజరు*
*సంక్రాంతి విన్నర్ గా నారీ నారీ నడుము మురారీ సక్సెస్ మీట్ నిర్మాత అనిల్ సుంకర, డైరెక్టర్ రామ అబ్బరాజు వెల్లడి*
విజయవాడ : లో బడ్జెట్‌లో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించటం తెలుగు చిత్ర సీమకు శుభపరిణామమని, చిన్న సినిమాలు విజయం సాధించటం వల్ల మూవీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్పూర్తి పొందుతారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు.
సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నిర్మాత అనిల్ సుంకర్ నిర్మించగా, డైరక్టర్ రామ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన నారీ నారీ నడుమ మురారీ మూవీ సక్సెస్ మీట్ గురువారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగింది. నిర్మాత అనిల్ సుంకర, డైరెక్టర్ రామ అబ్బరాజు నిర్వహించిన సక్సెస్ మీట్ కి ముఖ్యఅతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు.
ఈసందర్భంగా నిర్మాత అనిల్ సుంకర, డైరెక్టర్ రామ అబ్బరాజు తో కలిసి కేక్ కట్ చేసిన నారీ నారీ నడుమ మురారీ మూవీ టీమ్ కి ఎంపీ కేశినేని శివనాథ్ అభినందనలు తెలిపారు.
ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఈ సంక్రాంతి సందర్భంగా ఏ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారీ’ మంచి విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. గతంలో బాలకృష్ణ నటించిన ‘నారీ నారీ నడుమ మురారీ’ బ్లాక్‌బస్టర్ హిట్ కాగా, అదే టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రం కూడా సక్సెస్ సాధించిందన్నారు.
తనకు మిత్రులైన హీరో శర్వానంద్ నటించిన, నిర్మాత అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం ఘన విజయం సాధించాలనే కోరుకున్నానని, ఫైనల్ షెడ్యూల్ ప్రారంభానికి ముందు అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకోవడం వల్ల ఎలాంటి ఆటంకం కలగకుండా సినిమా విడుదలై విజయం సాధించిందన్నారు.
చిత్రసీమ బాగుండాలంటే మరిన్ని చిన్న సినిమాలు రావాలని, అవి కూడా విజయాలు సాధించాలని కోరుకున్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన ఐదు సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయని, అందులో ‘నారీ నారీ నడుమ మురారీ’ కొంచెం ఎక్కువ ప్రేక్షకాదరణ పొందటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కుటుంబ కథా చిత్రాలు ఎక్కువగా చేసే హీరో శర్వానంద్ ఈ సినిమాతో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చారని ప్రశంసించారు. మొత్తం మూవీ టీమ్‌కు అభినందనలు తెలిపారు.
నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన నారీ నారీ నడుమ మురారీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవటంతో పాటు , సంక్రాంతి విన్నర్ గా నిలిచిందని ప్రేక్షకులు చెప్పటం ఎంతో సంతోషంగా వుందన్నారు. దసరా శరన్నవరాత్రుల సమయంలో హీరో శర్వానంద్.
దర్శకుడు రామ అబ్బరాజు , తను ఎంపీ కేశినేని శివనాథ్‌తో కలిసి అమ్మవారి దర్శనం చేసుకుని,ఆశీస్సులు అందుకున్న తర్వాతే ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించామని గుర్తు చేశారు.
అమ్మవారి ఆశీస్సులతోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోందని, అందుకే విజయవాడ నుంచే మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ చిత్రానికి విశేష ఆదరణ అందించిన ప్రేక్షకులందరికీ చిత్ర బృందం తరుఫున కృతజ్ఞతలు తెలిపారు. గత రెండేళ్లుగా ఇలాంటి ఘన విజయం అందుకోవాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. తన మిత్రుడు ఎంపీ కేశినేని శివనాథ్ సహకారం, ప్రోత్సాహకం ఎప్పటికి మర్చిపోలేనన్నారు. ఆయనకు ఎన్ని పనులు వున్నా సినిమా విడుదల ముందు రోజు గంట గంటకి పోన్ చేసి జరుగుతున్న పని గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారని వివరించారు. వినోదాత్మక కుటుంబ కథాచిత్రంగా రూపొందిన ఈ సినిమా చూసినవారికి ఆయుష్షు కూడా పెరుగుతుందంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
.
దర్శకుడు రామ అబ్బరాజు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతోనే ‘నారీ నారీ నడుమ మురారీ’ ప్రేక్షకుల ఆదరణ పొందిందన్నారు. సినిమా సక్సస్ సాధించటంతో అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం కోసం విజయవాడ వచ్చామని, సక్సెస్ సెలబ్రేషన్స్‌ను ఇక్కడ నుంచే ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సినిమాను సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులందరినీ స్వయంగా కలిసి ధన్యవాదాలు తెలుపుతామని చెప్పారు. ఈ అవకాశం కల్పించిన నిర్మాత అనిల్ సుంకర, హీరో శర్వానంద్, రచయితలు భాను, నందు లతో పాటు తనకి సహకరించిన మూవీ టీమ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతి కి విడుదలయ్యే హీరో శర్వానంద్ సినిమాలు బాక్సాపీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయని, ఈ సినిమాతో సంక్రాంతి హ్యాట్రిక్ సాధించాడన్నారు.






