కర్నూలు : కర్నూలు జిల్లా :ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్ల మోసాలు…సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.మోసపోవడానికి ప్రధాన కారణం…. అత్యాశ, అశ్రద్ద…మోసగాళ్ళ మాటలు నిజమని నమ్మకండి.పథకాల పేరుతో వచ్చే తెలియని ఫేక్ లింకులను క్లిక్ చేయవద్దు.బ్యాంకు ఖాతాల ఓటిపిలు చెబితే మోసపోతారు..
జాగ్రత్త!…డీఐజీ , కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ !! ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్, ముద్ర లోన్స్, సూర్యఘర్, అమ్మవడి వంటి పథకాల పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ లింకులను పంపి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఐజీ , కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు శుక్రవారం తెలిపారు.
‘ఇది ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. మీకు రూ. లక్షలలో రాయితీ’ అంటూ ఆకర్షించి ఖాతాలను కొల్లగొడుతున్నారు.ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారిని ఎంచుకొని మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆయా పథకాల పేరుతో మొబైల్ కు వచ్చే తెలియని , ఫేక్ల్ లింకులను క్లిక్ చేయవద్దన్నారు.
ఓటీపీలు చెబితే మోసపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. డిఐజి , జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ గారి సూచనలు…- అపరిచిత లింకులను నమ్మవద్దు.- ప్రభుత్వ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించాలి. – వ్యక్తిగత సమాచారం షేర్ చేయవద్దు. బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దు.
అపరిచిత కాల్స్ వస్తే 1930 నంబరుకు కాల్ చేయాలి. అదేవిధంగా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలి.- ఇలాంటి మోసాల గురించి కుటుంబసభ్యులు, స్నేహితులకు తెలియజేసి సైబర్ మోసాల బారిన పడకుండా అవగాహన పెంచాలి.- ప్రభుత్వ పథకాల సమాచారం కోసం www.gov.in, nic.in లాంటి అధికారిక డొమైన్‌లను మాత్రమే ఉపయోగించాలి అని ఒక ప్రకటనలో తెలియజేశారు
