Saturday, January 17, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshవిజయవాడ కుమ్మరిపాలెం ఈద్గా షాది ఖానా బరియల్ గ్రౌండ్ సందర్శన

విజయవాడ కుమ్మరిపాలెం ఈద్గా షాది ఖానా బరియల్ గ్రౌండ్ సందర్శన

రాజకీయాలకు అతీతంగా ఈద్గా, షాదీ ఖానా, బరియల్ గ్రౌండ్ అభివృద్ధి : ఎంపీ కేశినేని శివనాథ్

కుమ్మ‌రి పాలెం లో షాదీఖానా, ఈద్గా గ్రౌండ్, బ‌రియ‌ల్ గ్రౌండ్ సంద‌ర్శ‌న

ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను ఆహ్వానించిన మ‌క్కా మ‌స్జీద్ మ‌రియు మ‌దీనా మ‌స్జీద్ క‌మిటీ

విజ‌య‌వాడ : పశ్చిమ నియోజకవర్గం కుమ్మ‌రి పాలెం గుప్తా సెంట‌ర్ లోని షాదీ ఖానా, ఈద్గా ప్రాంగ‌ణం, బ‌రియ‌ల్ గ్రౌండ్ ను విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ శుక్రవారం ప‌రిశీలించారు. మ‌క్కా మ‌స్జీద్ మ‌రియు మ‌దీనా మ‌స్జీద్ క‌మిటీ ఆహ్వానం మేర‌కు టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఫ‌తావుల్లా తో క‌లిసి పరిశీలనకు వచ్చిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ కి ఈద్గా కమిటీ సభ్యులు కుమ్మరిపాలెం వద్ద గల ముస్లింల బరియల్ గ్రౌండ్, మస్జిద్-ఎ-మదీనా, ఈద్గా మరియు షాదీ ఖానా సమస్యలను కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు.

సుమారు 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బరియల్ గ్రౌండ్ చాలా పల్లంగా ఉండటంతో, అక్కడ ఖననం చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వర్షాకాలంలో నీరు నిలిచి మరింత సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. కావున బరియల్ గ్రౌండ్ అభివృద్ధి కోసం ఎర్రమట్టి పూడిక, సిమెంటు రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు.

అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింల కోసం ఉన్న షాదీ ఖానాల్లో ఈ షాదీఖానా ఒకటని, దీనిని 2000వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మించారని కమిటీ సభ్యులు గుర్తు చేశారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు దీని అభివృద్ధిపై తగిన దృష్టి సారించలేదని విన్నవించారు. ఈ షాదీ ఖానాను మస్జిద్-ఎ-మదీనా కమిటీ సంరక్షణలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడానికి ఎంపీ కేశినేని శివ‌నాథ్ సహకారం అందించాలని ప్రాంత ముస్లిం ప్రజలు ఆకాంక్ష వ్యక్తం చేశారు.

దీనిపై స్పందించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఈద్గా, షాదీ ఖానాల అభివృద్ధి కోసం వక్ఫ్ బోర్డుతో చర్చించి నిధుల సమీకరణ చేస్తామని, అవసరమైన మేరకు ఎంపీ నిధుల నుంచి కూడా కేటాయింపులు చేస్తామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలోని మసీదుల కమిటీలను సమన్వయం చేసుకొని, రాజకీయాలకు అతీతంగా ఈద్గా, షాదీ ఖానా, బరియల్ గ్రౌండ్ అభివృద్ధి పనులు చేపడతామని స్పష్టం చేశారు.

అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ తన పర్యటన సందర్భంగా ఇక్కడ గుర్తించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా పేద ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నందున, తప్పకుండా వారి విజ్ఞప్తి మేరకు సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత తనపై అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరుకున్నట్లు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో తాను పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. సొంత డబ్బులతో గత 25 ఏళ్లుగా ఇక్కడి ముస్లింల ఆధ్వర్యంలో ప‌లు కార్యక్రమాలు జరుగుతున్నాయని, అతి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు.

ఈ కార్య‌క్ర‌మంలో మ‌క్కా మ‌స్జీద్ మ‌రియు మ‌దీనా మ‌స్జీద్ క‌మిటీ స‌భ్యులు స‌య్య‌ద్ హుస్సెన్, బాబు, షేక్ బ‌షీర్, యూసుఫ్, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు త‌మీమ్ అన్సార్, తెలుగు దేశం పార్టీ నాయ‌కులు క‌రీముల్లా, సుబానీ, స‌త్తార్, అజీజ్ ల‌తో పాటు ఇత‌ర క‌మిటీ స‌భ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments