విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 22 వస్తువులతో స్కూల్ కిట్లు పంపిణీ!
తెలంగాణ : ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక అడుగు వేసింది.
1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 22 రకాల వస్తువులతో కూడిన స్కూల్, హాస్టల్ కిట్లను పంపిణీ చేయనుంది. ఈ మేరకు వచ్చే విద్యా సంవత్సరం(2026-27) నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేసింది.
ఈ కిట్‌లలో భాగంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్‌బుక్‌లతో పాటు ఏకరూప దుస్తులు , స్కూల్ బ్యాగ్, నాణ్యమైన బూట్లు, సాక్స్, బెల్ట్, టై, ఐడీ కార్డు, స్పోర్ట్స్ డ్రెస్, పీటీ డ్రెస్ వంటి 22 రకాల వస్తువులను పంపిణీ చేయనున్నారు.






