అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్‌లో ప్రసంగించిన డా. కేఏ పాల్
అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్‌లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా. కేఏ పాల్ ప్రసంగించారు. భారత్–అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావాలని.
ప్రపంచ శాంతి కోసం ఇరు దేశాలు కలిసి నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న 58 యుద్ధాల వల్ల లక్షలాది ప్రాణాలు కోల్పోతుండటంతో పాటు ట్రిలియన్ల డాలర్లు వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాలు వెంటనే ఆగిపోవాలని ప్రత్యేకంగా ప్రార్థించారు.




