కర్నూలు : కర్నూలు సిటీ :
పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్• కార్మికులకు 21 రకాల పనిముట్ల అందజేతనగరంలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో పాటు పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, వారి ఆరోగ్య పరిరక్షణకు నిరంతరం చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు.
మంగళవారం బి.క్యాంపు శానిటేషన్ స్టోర్ వద్ద రూ.82 లక్షల వ్యయంతో పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన 21 రకాల రక్షణ సామగ్రి, పనిముట్లను అందజేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగర పరిశుభ్రత కోసం పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజూ కఠిన పరిస్థితుల్లో శ్రమిస్తున్నారని, వారి భద్రత, ఆరోగ్య రక్షణ నగరపాలక సంస్థకు అత్యంత ముఖ్యమని కమిషనర్ పేర్కొన్నారు.
సరైన పనిముట్లు, రక్షణ సామగ్రి అందుబాటులో ఉంటే పని సామర్థ్యం పెరుగుతుందని, వ్యాధుల నివారణతో పాటు నగరంలో పరిశుభ్రత ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని అన్నారు. రూ.82 లక్షలతో 21 రకాల పనిముట్లు కొనుగోలు చేసి కార్మికులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. 49 పుష్ కార్ట్‌లు, ఎప్రాన్‌లు, మాస్కులు, చేతి గ్లౌజులు, రెయిన్ కోట్లు, చెత్త డబ్బాలు, టబ్‌లు, గడ్డ పారలు, చిన్న సైజు ఇనుప రేకులు, రేకు బొంగులు, పిక్ యాక్స్, కొడవళ్లు, సాలికలు, ట్రాక్టర్ కప్పేందుకు నెట్లు, పెద్ద సైజు పంజాలు, గొడ్డళ్లు, టాయిలెట్ బ్రష్‌లు, నాఫ్తలిన్ బంతులు వంటి మొత్తం 21 రకాల పనిముట్లు కలిపి 39,809 పనిముట్లు పారిశుద్ధ్య కార్మికులకు అందజేసినట్లు వెల్లడించారు.






