హైదరాబాద్ : బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో సంక్రాంతి సంబరాలను, తన సతీమణి శోభమ్మ, కుమారుడు కేటీఆర్, కోడలు శైలిమ, తన మనవడు హిమాన్షు, మనవరాలు అలేఖ్య తో కలిసి ఘనంగా జరుపుకున్నారు.
ఫామ్ హౌస్ ప్రాంగణాన్ని గొబ్బెమ్మలు, నవధాన్యాలు మరియు చెరుకు గడలతో సాంప్రదాయబద్ధంగా అలంకరించారు. రంగవల్లులతో నిండిన ఫామ్ హౌస్ పల్లెటూరి వాతావరణాన్ని తలపించింది.
గత పండుగలకు విరుద్ధంగా ఎర్రవల్లి వేడుకలకు కెసిఆర్ కూతురు కవిత దూరంగా ఉన్నట్టు తెలిసింది.
ఈ సందర్భంగా కెసిఆర్ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
తన పదేళ్ల పాలనలో తెలంగాణలో సాధించిన వ్యవసాయ పురోగతిని ఆయన గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం మళ్ళీ సుభిక్షంగా మారి, రైతుల జీవితాల్లో వెలుగు నింపాలని ఈ సందర్భంగా కోరుకున్నారు.
#sidhumaroju






