BCలకు 42% సీట్లు.. పార్టీలు అమలు చేస్తాయా?
తెలంగాణ : సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లను 50% మించకుండా ఖరారు చేశారు. అయితే BCలకు 42% స్థానాలు ఇస్తామన్న హామీని ఈ ఎన్నికల్లో అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రతిపక్ష BRSకు ఇదో అవకాశం కానుంది.
మున్సిపల్ ఎన్నికల్లో 32%(38 స్థానాలు) కార్పొరేషన్లో 30%(3 చోట్ల) కేటాయించారు. కాగా హామీని నెరవేర్చేందుకు మరో 12 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలోనూ BC అభ్యర్థులనే ప్రకటించాల్సి ఉంది. మరి పార్టీలు ఎలాంటి ప్రకటన చేస్తాయో వేచి చూడాలి.




