ఈ సంక్రాంతికి ఎన్టీఆర్ జిల్లా మొత్తం పండుగ వాతావరణంతో వైబ్రెంట్‌గా కనిపిస్తుంది
సంక్రాంతి సంబరాలు ప్రజలకు మరపురాని అనుభూతి
ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి .
జగ్గయ్యపేటలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
సుగాలి నృత్యంలో కాలు కదిపిన ఎంపీ కేశినేని శివనాథ్
కర్ర సాముతో ఆకట్టుకున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్
జగ్గయ్యపేట : ఈ సంక్రాంతికి ఎన్టీఆర్ జిల్లా మొత్తం పండుగ వాతావరణంతో వైబ్రెంట్ గా కనిపిస్తోంది. తెలంగాణ నుంచి కూడా తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాలకు ప్రజలు వచ్చి సంబరాల్లో పాల్గొన్నారని తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నాయకత్వంలో జగ్గయ్యపేటలో శుక్రవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా సాగాయి.
జగ్గయ్యపేట పట్టణంలోని ముత్యాల రోడ్డు పాతపేట గడ్డ నందు నిర్వహించిన ఈ సంక్రాంతి సంబరాల్లో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం , మాదిగ కార్పోరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి , రాష్ట్ర కార్య నిర్వాహ కార్యదర్శి జంపాల సీతారామయ్య , జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర , జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెల సీతమ్మ లతో కలిసి ముఖ్యఅతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు.
ఈ సంబరాల్లో పిల్లల సాంస్కృతి నృత్యాలు , లంబాడ సుగాలి డాన్స్ , చిన్నారుల కర్ర సాము, కోలాటం, గంగిరెద్దుల విన్యాసాలు ప్రజలను అలరించాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ చేసిన కర్రసాము ప్రజలతో చప్పట్లు కొట్టించింది . అలాగే ఎంపీ కేశినేని శివనాథ్ లంబాడీలతో కలిసి నృత్యం చేశారు. ఇక జగ్గయ్యపేట మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల కుమార్ రాజా ఇంటి వద్ద సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రజానీకానికి ఏర్పాటుచేసిన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ సంక్రాంతి అనేది బంధు మిత్రులతో కలసి జరుపుకునే సంప్రదాయ పండుగ అని, ఎక్కడున్నా స్వగ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన సంక్రాంతి పండుగ ప్రత్యేకత అని అన్నారు.
ఆర్యవైశ్య సామాజిక వర్గం రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని, వ్యాపారాల ద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం అందిస్తూ ఉద్యోగ కల్పనలో ముందుంటుందని ప్రశంసించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడటంలో ఆర్యవైశ్యుల అవగాహన, సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అనేక ఆలయాల వద్ద ఆర్యవైశ్యులు నిర్మించిన సత్రాలు కనిపిస్తాయని, అహింస పద్ధతిలో జీవనం సాగించే వర్గమని కొనియాడారు.
కులమతాలకు అతీతంగా ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించటం ఆనందకరమని, జగ్గయ్యపేటలో జరిగే సంక్రాంతి వేడుకలకు ప్రతి ఏడాది హాజరవుతానని ఎంపీ హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ చేసిన కర్రసాము అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఈసారి విజయవాడ ఉత్సవ్‌లో కూడా కర్రసాము ప్రదర్శన ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరటం జరిగింది. సంక్రాంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామానికి వెళ్లారని, రీచార్జ్ అయి తిరిగి వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు తీసుకెళ్లుందుకు సన్నద్దంగా వున్నారనన్నారు. .
నందిగామ–జగ్గయ్యపేట సర్వీస్ రోడ్డు కాంట్రాక్టర్ సమస్య వల్ల ఆలస్యం జరిగినా, హైదరాబాద్ నుంచి వచ్చే రోడ్డు పూర్తైందని, గత మూడు రోజుల్లో విజయవాడ–హైదరాబాద్ మార్గం కూడా పూర్తి అయిందని తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు ప్రయాణం చేసేందుకు నందిగామ, జగ్గయ్యపేట వద్ద ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నట్లు భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు షరాబు వర్తక సంఘం ప్రెసిడెంట్ శ్రీరామ్ సుబ్బారావు , మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల కుమార్ రాజా, ఆర్యవైశ్య యువజన సంఘ ప్రెసిడెంట్ నూకల బాలకృష్ణ లతో పాటు ఆర్యవైశ్య ప్రముఖులు, జగ్గయ్యపేట మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు , ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




