అనంత: మరదలితో ప్రేమ.. సుత్తితో కొట్టి చంపిన బావ
హైదరాబాద్ జగద్గిరిగుట్ట శ్రీరామ్ నగర్లో గురువారం దారుణ హత్య జరిగింది. సొంత మరదలిని(17) సుత్తితో కొట్టి బావ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు అనంతపురానికి చెందిన పవన్ కుమార్ (25)గా గుర్తించారు. రెండేళ్ల క్రితం HYD వెళ్లి టింబర్ డిపోలో పనిచేస్తుండగా విభేదాలతో ఇటీవల భార్య అతన్ని వదిలి ఇంటికి వచ్చింది.
ఆ తర్వాత మరదలితో ప్రేమాయణం నడిపాడు. ఈ క్రమంలో నిన్న జరిగిన గొడవలో ఆమెను హత్య చేశాడు.




