తిరుమల గిరిపై కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి చెంత సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ముక్కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం
శనివారం నాడు ‘పార్వేట ఉత్సవాన్ని’ అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా నిర్వహించింది. వేలాదిగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో శ్రీమలయప్ప స్వామి వారు వేటగాడి రూపంలో దర్శనమివ్వడం ఈ ఉత్సవం యొక్క ప్రధాన ఆకర్షణ.
