తెలంగాణలో మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల*
హైదరాబాద్: తెలంగాణలో మోడల్ స్కూళ్ల (model school) ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఏప్రిల్ 19న మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆరో తరగతి ప్రవేశాలు, 7నుంచి పదో తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.