ధర్మవరం: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న అజయ్ బేకరీలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి.
బందోబస్తులో ఉన్న పోలీసులు గమనించి బేకరీ యజమానికి సమాచారం అందించారు. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి వారు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రూ. లక్షల్లో నష్టం వాటిల్లిందని బేకరీ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
