Home South Zone Andhra Pradesh రైతుల సమస్యలను కూటమి ప్రభుత్వం తీరుస్తుంది |

రైతుల సమస్యలను కూటమి ప్రభుత్వం తీరుస్తుంది |

0
0

రైతుల స‌మ‌స్య‌ల‌ను కూట‌మి ప్ర‌భుత్వం ప‌రిష్క‌రిస్తుంది.
మందడం గ్రామంలో రైతుల భేటీలో సుజనా చౌదరి

కూట‌మి ప్ర‌భుత్వం రాజ‌ధాని రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తుంద‌ని విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి రైతుల‌కు హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం మంద‌డంలో స్థానిక నాయకుడు మాదల రాజేంద్ర నివాసంలో సుజ‌నా చౌద‌రితో రైతులు భేటీ అయ్యారు… ఈ సంద‌ర్భంగా రాజ‌ధాని గ్రామాల‌కు చెందిన ప‌లువురు
సుజనా ను కలిసి తమ సమస్యలను ఏకరువు పెట్టారు . పూలింగ్ కు భూములు ఇచ్చిన రైతుల స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌డంలో అధికారులు అల‌స‌త్వం వ‌హిస్తున్నార‌ని సుజ‌నా చౌద‌రి కి రైతులు తెలిపారు.

కొందరు అధికారుల తీరు వల్ల సమస్యలు జటిలం అవుతున్నాయని రైతులు వివరించారు. 29వేల మంది రైతుల‌లో కేవ‌లం రెండు శాతం మంది ఎద‌ర్కొంటున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో అధికారులు స‌రిగా స్పందించ‌క పోవ‌డం వ‌ల్ల అది అంద‌రి రైతుల స‌మస్య‌గా ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న రేగుతోంద‌ని ఆవేద‌నం వ్య‌క్తం చేశారు. ఈ కార‌ణంగా ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తోంద‌ని తెలిపారు. 2019 నుంచి 24 వ‌ర‌కు రాజ‌ధానిని కాపాడుకోవ‌డంలో చేసిన పోరాటంలో సుజ‌నా చౌద‌రి స‌హ‌కారాన్ని ,ప్ర‌మేయాన్ని రైతులు కొనియాడారు. అధికారుల తీరు వల్ల గతంలో 14 అంశాలకు సంబంధించి సమస్యలుండగా ప్రస్తుతం అవి 20 అంశాలు దాటాయని రైతులు వాపోయారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి రైతుల‌తో ప‌లు అంశాల‌ను చ‌ర్చించారు. కూటమి సర్కారు రైతుల సంస్థలను ఖచ్చితంగా పరిష్కరిస్తుందని సుజ‌నా చౌద‌రి రైతుల‌కు భ‌రోసా ఇచ్చారు. రైతులంతా ఐక్యంగా ఒక సంఘంగా ఏర్పడి ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్లాలని సూచించారు..

ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా కాకుండా రైతుల తరపున 4గురు ప్రతినిధులుగా ఎంపిక చేసి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో మానిటరింగ్ చేసుకోండనీ రైతుల‌కు సుజ‌నా సలహా ఇచ్చారు. సమస్యల అర్జీల స్టేటస్, ట్రాకింగ్ కోసం అవసరమైతే రైతులకు నా తరపున ఒక సాఫ్ట్వేర్ మెకానిజం ను అంద చేస్తానని రైతులకు సుజ‌నా హామీ ఇచ్చారు. . స్తానిక ఎమ్మెల్యే, ఎంపీ పెమ్మసాని, మంత్రి నారాయణ అందరూ సామర్థ్యం ఉన్న నాయకులే కాబ‌ట్టి వారి తో సమన్వయంతో ముందుకు సాగండనీ రైతుల‌కు సూచించారు.

అమరావతి రాజధాని గా ఉండేలా కేంద్ర ప్ర‌భుత్వం చట్టం చేస్తుంద‌ని, దానికి సంబంధించిన సాంకేతిక అంశాలు ప్రాసెస్ లో ఉన్నాయని సుజ‌నా వివ‌రించారు. కూట‌మి స‌ర్కార్ రాజ‌ధాని అమ‌రావ‌తి అభివ్రిద్దికి క‌ట్టుబ‌డి ఉంటుంద‌ని ఆయ‌న ఉద్ఘాటించారు. కార్య‌క్ర‌మంలో స్థానిక నాయ‌కులు మాద‌ల శ్రీనివాస్, యుగంధ‌ర్ , ధ‌నేకుల రామారావు, మ‌హిళ‌లు పాల్గొన్నారు.

NO COMMENTS