Home South Zone Telangana జనవరి 18న ఛలో ములుగు జిల్లా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర

జనవరి 18న ఛలో ములుగు జిల్లా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర

0

మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహా కుంభమేళా జాతర మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర గుడి పునరనిర్మాణం గద్దెలను పరిశీలించడానికి విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రివర్గం.

నియోజకవర్గాల శాసనసభ్యులు ప్రభుత్వ యంత్రాంగం ప్రజా ప్రతినిధులతో జనవరి 18న మేడారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ సమావేశం, రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయి, మేడారంకు అరుదైన గుర్తింపు ములుగు నియోజకవర్గం ప్రజలందరికీ గుర్వకారణమని గంగారం మాజీ మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ (ఎంపీపీ) సువర్ణపాక సరోజన జగ్గారావు అన్నారు.

రాష్ట్ర మంత్రి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు జనవరి 18న జరిగే తెలంగాణ ముఖ్య మంత్రి ఎనుముల రేవంతన్న మహాసభకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ గ్రామకమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అన్ని గ్రామాల సర్పంచ్, ఉప సర్పంచ్ లు మరియు వార్డు సభ్యులు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ లు, కాంగ్రెస్ పార్టీ ఎన్ రోలర్లు.

పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, యువజన సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జనవరి 18న ఛలో మేడారం పిలుపు కార్యక్రమంలో పాల్గొనాలని మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు సువర్ణపాక సరోజన జగ్గారావు పిలుపునిచ్చారు.

NO COMMENTS

Exit mobile version