Saturday, January 17, 2026
spot_img
HomeSouth ZoneTelanganaధరణి–భూభారతి స్కామ్‌లో 15 మంది అరెస్ట్ |

ధరణి–భూభారతి స్కామ్‌లో 15 మంది అరెస్ట్ |

మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): రాష్ట్రంలో సంచలం సృష్టించిన జనగామ, యాదాద్రి జిల్లాల్లో ధరణి, భూభారతీ రిజిస్ట్రేషన్లలో 3.90కోట్ల రూపాయల కుంభకోణంలో ప్రభుత్వ అదాయానికి గండి కొట్టిన మొత్తం ముఠాలోని 15 మందిని జనగామ పోలీసులు అరెస్టు చేయగా, మరో తొమ్మిది మంది ప్రస్తుతం పరారీలో వున్నారు. ఈ ముఠా సభ్యుల నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నవి 63.19 లక్షల నగదు, బ్యాంక్లో 1లక్ష రూపాయలు, సుమారు ఒక కోటి రూపాయల విలువైన ఆస్తి పత్రాలు, ఒక కారు, రెండు ల్యాప్ టాప్లు, ఐదు డెస్క్ టాప్ కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో…
1.పసునూరి బసవ రాజు, వయసు: 32 సంవత్సరాలు,యాదాద్రి జిల్లా…
2. జెల్లాపాండ, వయసు: 46 సంవత్సరాలు, యాదాద్రి జిల్లా…
3.మహేశ్వరం గణేష్ కుమార్, వయసు: 39 సంవత్సరాలుఇయాదాద్రి జిల్లా.
4 ఈగజులపాటి శ్రీనాథ్ వయసు: 35 సంవత్సరాలు, జనగామ.
5. యెనగంధుల వెంకటేష్, జనగామ.

6 కోదురి శ్రావణ్ వయసు: 35 సంవత్సరాలు, జనగామ.
7. కొలిపాక సతీష్ కుమార్ వయసు: 36 సంవత్సరాలు, కొడకండ్ల (ఎం), జనగామ.
8. తడూరి రంజిత్ కుమార్ వయసు 39 సంవత్సరాలు, నర్మెట్ట, జనగామ.
9. దుంపల కిషన్ రెడ్డి, వయసు: 29 సంవత్సరాలు, ఆత్మకూర్ (ఎం), యాదాద్రి జిల్లా..
10. దశరథ మేఘావత్ వయసు: 28 సంవత్సరాలుతురుపల్లి.

11. నారా భాను ప్రసాద్, వయసు: 30 సంవత్సరాలు, యాదగిరిగుట్ట,
12. గొపగాను శ్రీనాథ్, వయసు: 32 సంవత్సరాలు, శివ కుమార్, వయస్సు 33, అమంగల్, నల్లగొండ.
13. అలేటి నాగరాజు, వయస్సు 32, యాదాద్రి జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వివరాలను వెల్లడిస్తూ ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులైన పసునూరి బసవరాజు, జెల్లా పాండు ఇరువురు యాదాద్రి-భువనగిరి జిల్లా యాదగిరి గుట్లలో అన్లైన్ సర్వీస్ నిర్వహించేవారు. ఇందులో నిందితుల్లో ఒకడైన గణేష్ తనకు తాను అన్లైన్ సెంటర్లతో పరిచయం చేసుకోని చేల్లించాల్సిన మొత్తాన్ని ఏన్ఆర్ఐ ఖాతా పే చేస్తానని చెప్పి రైతుల నుండి మొత్తం డబ్బులను మీసేవ వ్యక్తుల ద్వారా వసూలు చేయించి అట్టి వసూలు చేసిన డబ్బు నుండి అన్లైన్ సర్వీస్ వ్యక్తులకు మరియు మద్యవర్తులకు కమిషన్ చొప్పున డబ్బు అందజేస్తూ .

ఇ చాలాన్ని ప్రధాన నిందితుడుకి పంపిచేవాడు. ఇలా వచ్చిన చలాన్లను బసవరాజు అట్టి ధరణీ/భూభారతీ వెబ్సైట్లో ఇన్ స్పెక్ట్ ” ఎడిట్ అప్లికేషన్ ఉపయోగించి చాలన్ రుసుము తగ్గించేవాడు. అనంతరం అట్టి ఛలాన్ ను మొబైల్ ద్వారా ఎడిట్ చేసి తిరిగి రైతులకు పంపేవాడు.ఇదే క్రమంలో నిందితులు మొబైల్ ఆప్లికేషన్ను ఉపయోగించి నిందితులు ప్రభుత్వానికి చెల్లించిన రుసుము కు సంబంధించి వెబ్సైట్లో జారీ అయిన రసీదులను చెల్లించాల్సిన దాని కంటే తక్కువగా మార్పు చేసి అనంతరం మార్పు చేసిన రుసుమును మాత్రమే ప్రభుత్వానికి చెల్లించిన నకిలీ చలాన్లను స్థానిక యంఆర్ఓ/రిజిస్ట్రేషన్ కార్యాలయములో మద్యవర్తుల ద్వారా సమర్పిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ మోసాలకు పాల్పడేవారు.

ప్రధాన నిందితులు ఇద్దరు సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడి  జనగామ, యాదాద్రి జిల్లాల్లో మీ సేవ, ఆన్లైన్ సర్వీసులు, మద్యవర్తుల వద్ద నమోదు కావాల్సిన ధరణీ, భూభారతి రిజిస్ట్రేషన్ పత్రాలను ప్రధాన నిందితులు తమ వద్దనే వెబ్ సైట్లో నమోదు చేసేవారు. ఇందుగాను ప్రధాన నిందితులు మిగితా వారికి పది శాతం నుండి 30శాతం వరకు కమిషన్ చెల్లించేవారు.

ఈ కేసుకు సంబంధించి జనగామ, యాద్రాద్రి జిల్లాల్లో 1,080 పత్రాలకు సంబందించిన లావా దేవిల్లో నిందితులు మోసాలకు పాల్పడ్డారు. అలాగే ఈ రెండు జిల్లాలో జరిగిన ఈ కుంభకోణానికి సంబంధించి 22 కేసులు నమోదు కాబడ్డాయి. ఇందులో జనగామ జిల్లాలో 7కేసులు, యాదాద్రి జిల్లాలో 15 కేసులు నమోదు కాబడ్డాయని వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.ఈ ముఠా పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండరి చేతన్. జనగామ సిఐ సత్యనారయణరెడ్డి, రఘునాథ్ పల్లి సిఐ శ్రీనివాస్ రెడ్డితో ఇతర ఎస్ఐలు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments