మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన _అరైవ్_అండ్_అలైవ్ (arrive and alive) కార్యక్రమంలో భాగంగా అల్వాల్ పోలీస్ యంత్రాంగం భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించింది.
అల్వాల్ లాఅండ్ ఆర్డర్ (L&O) పోలీసు మరియు ట్రాఫిక్ విభాగాల ఆధ్వర్యంలో ఉమ్మడిగా జరిగిన ఈ కార్యక్రమం.. అల్వాల్ పోలీస్ స్టేషన్, జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయం, మరియు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణాల్లో జరిగింది.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి సిబ్బంది, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, పారామెడికల్ వైద్యులతో పాటు అల్వాల్ పోలీస్ సిబ్బంది భారీ ఎత్తున పాల్గొన్నారు.
నిత్యం పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని, వాహనదారులు పాటించాల్సిన ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ మరియు సీటు బెల్టు ధరించడం యొక్క ప్రాముఖ్యతను అధికారులు వివరించారు.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించకుండా బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరిస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ప్రతిజ్ఞ (Oath) చేశారు.
ఈ సందర్భంగా అల్వాల్ ఎస్ హెచ్ ఓ ప్రశాంత్ మాట్లాడుతూ.. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, నియమాలను పాటించడం వల్ల ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు.
ఈ ప్రచార కార్యక్రమానికి సహకరించిన అన్ని విభాగాల అధికారులకు, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
#sidhumaroju
