మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ గూడూరు నందు వివిధ కేసులలో సీజ్ చేయబడిన వాహనాలకు మహబూబాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీ కిరణ్ సమక్షంలో బహిరంగ వేలం వేయబడుతుందని గూడూరు సిఐ బిక్షపతి అన్నారు.
వివిధ కేసులలో నల్ల బెల్లం, నాటు సారాయి రవాణా కేసులలో పట్టుబడినటువంటి మూడు ఆటోలు, 32ద్విచక్ర వాహనాలు కలవు.
వేలంలో పాల్గొనదలచిన వారు స్వతహాగా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ గూడూరు నందు ఉంచబడినటువంటి వాహనాలను చూసి, బహిరంగ వేలంలో పాల్గొనలని.
వేలంలో పాల్గొనే వారు వాహనం ధరలో సగం రూపాయలను EMD గా, ఒక్కొక్క వాహనానికి విడివిడిగా మంగళ వారం ఉదయం 10 గంటల లోపు చెల్లించి వేలంలో పాల్గొనాలని తెలియజేశారు.





