మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య ఇంట్లో విషాదం నెలకొంది.
అనారోగ్యంతో ఆయన తల్లి థెరిసమ్మ గురువారం రాత్రి మరణించారు. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గాదె ఇన్నయ్యకు కోర్టు 48 గంటల బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన విడుదల కానున్నారు. కుటుంబ సభ్యులు చంచల్‌గూడ జైలు వద్ద ఎదురుచూస్తున్నారు.




