Home South Zone Andhra Pradesh ఏప్రిల్ దర్శనం టికెట్లు రేపు విడుదల : టీటీడీ |

ఏప్రిల్ దర్శనం టికెట్లు రేపు విడుదల : టీటీడీ |

0

కర్నూలు : 2026 ఏప్రిల్ నెలకు సంబంధించి వివిధ దర్శనాలు, గదుల కోటా వివరాలను, శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ)కు సంబంధించిన కోటాను సోమవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జనవరి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్ లో నమోదు చేసుకోవచ్చు.

ఈ టికెట్లు పొందిన వారు జనవరి 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాలి.22న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల టికెట్లను, అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటాను విడుదల చేయనుంది. 23న అంగప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటా, మధ్యాహ్నం వయోవృద్ధులు.

దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా, మధ్యాహ్నం తిరుమల, తిరుపతిలో గదుల కోటా విడుదల చేస్తారు. 27న శ్రీవారి సేవ, పరకామణి సేవ కోటాను విడుదల చేయనున్నారు https://ttddevasthanams.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

NO COMMENTS

Exit mobile version