కురబలకోట రైల్వే ఫ్లైఓవర్‌పై బుధవారం ఒక విద్యార్థి అతివేగంగా కారు నడపడంతో అది అదుపుతప్పి రోడ్డు పక్కన పిట్టగోడను ఢీకొట్టింది. కారు ఫ్లైఓవర్ కిందకు పడి ఉంటే ప్రాణనష్టం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
అదృష్టవశాత్తూ, ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
