Monday, January 19, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshకాకినాడ గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్‌పై జేపీ స్పందన |

కాకినాడ గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్‌పై జేపీ స్పందన |

Jayaprakash Narayan Praises Greenkos Kakinada Green Energy Complex
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో గ్రీన్ కో సంస్థ భారీ ప్రాజెక్ట్
ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా కాంప్లెక్స్ ఏర్పాటు
గ్రీన్ కోను మనస్ఫూర్తిగా అభినందించిన జయప్రకాశ్ నారాయణ
దేశ ఇంధన ప్రగతిలో ఇది కీలక మైలురాయి అని ప్రశంస

వికసిత భారత్ కోసం ఇలాంటి ఆవిష్కరణలు అవసరమని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసిన గ్రీన్ కో సంస్థపై లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. గ్రీన్ కో సంస్థకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

ఈ ప్రాజెక్ట్ వివరాలను ఆయన ప్రస్తావిస్తూ, “1950 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ సామర్థ్యంతో, 1.5 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యంతో ఏర్పాటైన ఈ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్.. భారతదేశ ఇంధన రంగ పరివర్తనలో, అధిక విలువైన రసాయనాల ఉత్పత్తిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.

ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన, భారీ ప్రాజెక్టులే దేశ ఆర్థిక వ్యవస్థను మార్చగలవని జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు. ఇలాంటి ముందుచూపుతో కూడిన ఆవిష్కరణలు, పెట్టుబడులు ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో అవసరమని అన్నారు. దేశ ప్రగతి కోసం మరిన్ని ఇలాంటి ఆవిష్కరణలు, పెట్టుబడులు రావాలని ఆయన ఆకాంక్షించారు. గ్రీన్ కో చొరవ దేశానికి ఆదర్శమని కొనియాడారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments