శుక్రవారం రాత్రి పుంగనూరు పట్టణంలో పుంగమ్మ చెరువు కట్టపై పుంగనూరు నుంచి బైరెడ్డిపల్లికి వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని షిఫ్ట్ డిజైర్ కారు ఢీకొట్టింది.
ఈ ఘటనలో ద్విచక్ర వాహనం రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో నుజ్జు నుజ్జయింది. ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న తరుణ్ కింద పడటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు విచారణలో వెల్లడి కానున్నాయి.
# కొత్తూరు మురళి




