బాపట్ల: పోలీస్ శాఖ పరిపాలనలో భాగంగా ఈ ఆఫీస్ పనితీరుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమా మహేశ్వర్ ఐపీఎస్ గారు.
పోలీస్ శాఖలో ఎంప్లాయి సర్వీస్ మాడ్యూల్స్ (ESM) ప్రక్రియను 100% పూర్తి చేసిన మొట్టమొదటి జిల్లాగా బాపట్ల పోలీస్ శాఖ నిలిచింది
ఈ ఆఫీస్ నిర్వహణపై డీపీఓ అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ గారు.
సిబ్బంది సమస్యలను సత్వరంగా పరిష్కరించేందుకు ఈ ఆఫీస్ ఒక వేదికగా.
భవిష్యత్తులో పూర్తిగా పేపర్‌లెస్ విధానంలోనే అన్ని సేవలు అందించాలి.
భవిష్యత్తులో పేపర్ వినియోగం లేకుండా సాంకేతికత ద్వారానే పోలీస్ శాఖ సేవలు అందించడంలో ఈ ఆఫీస్ కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు తెలిపారు. ప్రభుత్వ పరిపాలనలో భాగంగా ఈ-ఆఫీస్ (e-Office) విధానంపై బాపట్ల జిల్లా ఎస్పీ గారు శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్, డిపిఓ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, పోలీస్ శాఖలో సిబ్బంది సౌకర్యార్థం మరియు పారదర్శక సేవలు అందించేందుకు ఈ-ఆఫీస్ విభాగం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. భవిష్యత్తులో కాగితాన్ని ఉపయోగించకుండా కేవలం సాంకేతికత ద్వారానే వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యమని, దీనికి సంబంధించి డి.పి.ఓ (DPO) అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
జిల్లాలోని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, డిఎస్పీ కార్యాలయాలు మరియు జిల్లా పోలీస్ కార్యాలయం ఇలా ప్రతి విభాగం ఈ-ఆఫీస్‌తో అనుసంధానం కాబోతున్నాయని ఎస్పీ గారు పేర్కొన్నారు. దీనివల్ల ఎటువంటి పేపర్ ఉపయోగించకుండా అత్యంత వేగంగా, పారదర్శకంగా ఫైళ్ల కదలిక ఉంటుందని వివరించారు. ఇప్పటికే పోలీస్ శాఖలో ఎంప్లాయి సర్వీస్ మాడ్యూల్స్ (ESM) ప్రక్రియను 100% పూర్తి చేసిన మొట్టమొదటి జిల్లాగా బాపట్ల పోలీస్ శాఖ నిలిచిందని పేర్కొన్నారు. ఈ విధానం అమలులోకి రావడం వల్ల సిబ్బందికి కావాల్సిన సెలవులు మరియు ఇతర సేవలు అన్నీ అంతర్జాల వేదికగానే అందుతాయని, దీనివల్ల సిబ్బందికి సమయం ఆదా అవ్వడమే కాకుండా కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రయాణ భారం కూడా తగ్గుతుందని తెలిపారు. ఫైల్స్ పోతాయనే ఆందోళన ఉండదని, ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు పెండింగ్‌లో ఉన్న సమస్యలపై పర్యవేక్షణ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ ప్రక్రియపై సిబ్బందికి త్వరలోనే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఏఓ శ్రీనివాసరావు గారు, సోషల్ మీడియా సెల్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ రావు గారు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
#Narendra




