Home South Zone Andhra Pradesh వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా FIR డౌన్లోడ్: కర్నూలు ఎస్పీ

వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా FIR డౌన్లోడ్: కర్నూలు ఎస్పీ

0

కర్నూలు
హాయ్ అంటేFIR కాపీవాట్సాప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’లో FIR డౌన్‌లోడ్ సౌకర్యం * పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండానే FIR ప్రతిని పొందవచ్చని … డిఐజి,   కర్నూలు  జిల్లా ఇన్ చార్జీ  ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ వెల్లడి” మొబైల్ నుంచి వాట్సప్లో సందేశం” వనమిత్రలో పోలీస్ విభాగం ఎంపిక.. జిల్లా పోలీస్ స్టేషన్ల వివరాలు ప్రభుత్వం ప్రత్యేక చర్యలుహాయ్ అంటే ఎఫ్ఎఆర్ కాపీపోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత..

ఎఫ్ ఐ ఆర్ లో ఏ అంశాలు ఉన్నాయో తెలుసుకోవడం ఇప్పటివరకు సామాన్య ప్రజలకు కష్టమైన పని కానీ ఇక పై వాట్సప్లో ఎఫ్ఐఆర్ కాఫీని సులభంగా పొందవచ్చు . సాధారణంగా పోలీసులు దీన్ని బయటకు ఇవ్వరు. డిజిటల్ పాలనలో భాగంగా ఇప్పుడు వాట్సాప్ లో సులభంగా చూసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.పొందడం ఇలా..

. ఫిర్యాదుదారులు తమ చరవాణి నుంచి 9552300009 నెంబరు వాట్సప్ లో హాయ్ అని సందేశం పంపాలి. మనమిత్ర నుంచి సమాధానం వస్తుంది. అందులో పోలీసు విభాగం ఎంపిక చేసుకోవాలి. పోలీస్ విభాగంలోకి డౌన్లోడ్ ఎఫ్ఎఆర్ ను ఎంచుకోవాలి.

ఇందులో మన వివరాలు నమోదు చేయాలి. జిల్లా పోలీస్ స్టేషన్( మనం ఎక్కడ ఫిర్యాదు చేసామో అది) ఆ ఎఫ్ ఐ ఆర్ నెంబర్ (స్టేషన్లో పోలీసులు చెప్తారు) సంవత్సరం వివరాలు ఇచ్చాక FIR కాఫీ డౌన్లోడ్ అవుతుంది.ఉపయోగం ఏమిటంటే ఫిర్యాదులో పేర్కొన్న వివరాలన్నీ సరిగా నమోదు చేశారా? లేదా?ఏ సెక్షన్ పెట్టారు? తెలిసిన వ్యక్తులపైన కేసు పెట్టారా లేక ఇతరుల్ని చేర్చారా.

నేర తీవ్రత తగ్గించడానికి సెక్షన్ ను తారుమారు చేశారా? లాంటి ముఖ్యమైన వివరాలను తెలుసుకోవచ్చు.ప్రజలకు మరింత సులభమైన, వేగవంతమైన మరియు పారదర్శకమైన పోలీసు సేవలు అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ – “ *మన మిత్ర”* సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని డిఐజి,   కర్నూలు  జిల్లా ఇన్ ఛార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ జిల్లా ప్రజలకు  విజ్ఞప్తి చేశారు.

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి FIR నమోదు అనంతరం ఫిర్యాదుదారులు తమ FIR ప్రతిని పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండా మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. *FIR డౌన్‌లోడ్ విధానం:*  *ఫిర్యాదుదారు 95523 00009 నంబర్‌ను తన మొబైల్‌లో సేవ్ చేసి వాట్సాప్‌లో “Hi” పంపాలి.

*మెనూ నుండి Police Services → Download FIR ఎంపిక చేసుకోవాలి.*  *అవసరమైన వివరాలను నమోదు చేసి FIR ప్రతిని వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.* ఈ సేవల ద్వారా ప్రజలకు సమయం ఆదా కావడంతో పాటు, పోలీస్ సేవల్లో మరింత పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ అధికారులు ఈ సేవపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించామని… ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  డిఐజి,  కర్నూలు  జిల్లా ఇన్ ఛార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  తెలియచేశారు.

NO COMMENTS

Exit mobile version