ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జాయింట్ వెంచర్ డిజిటల్ కనెక్షన్ ఏపీలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు డిజిటల్ కనెక్షన్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఒక గిగావాట్ AI డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
దీని ద్వారా వచ్చే ఐదు సంవత్సరాలలో 11 బిలియన్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది.




