చీరాల: భోపాల్‌లో జరిగిన సౌత్ వెస్ట్ జోన్ యూనివర్సిటీ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో చీరాలకు చెందిన యువకుడు దేవరకొండ ప్రేమ్ సాగర్ అద్భుత ప్రతిభ కనబరిచి ఫోర్త్ ప్లేస్ సాధించాడు.ఈ ఫలితంతో అతనికి ఆల్ ఇండియా యూనివర్సిటీ నేషనల్ గేమ్స్‌లో పాల్గొనే అవకాశం దక్కింది.
ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో జరిగే పోటీల్లో ప్రేమ్ సాగర్ పాల్గొననున్నట్లు యోగివేమన యూనివర్సిటీ హెచ్‌ఓడీ (ఫిజికల్ ఎడ్యుకేషన్) రామసుబ్బారెడ్డి శనివారం తెలిపారు.గత ఏడాది ప్రేమ్ సాగర్ అల్ ఇండియా పోటీలలో థర్డ్ ప్లేస్ సాధించి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.
ఈ విజయం చీరాల ప్రాంతానికి గర్వకారణమని క్రీడాభిమానులు అభినందించారు.ప్రేమ్ సాగర్ తండ్రి దేవరకొండ ప్రవీణ్ కుమార్ బ్యాంక్ ఆఫ్ బరోడా లో విధులు నిర్వర్తిస్తూ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు టెక్నికల్ అఫీషియల్ గా వ్యవహరిస్తుంటారు.ప్రేమ్ సాగర్ తల్లి స్వాతి చీరాల నియోజకవర్గ తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు గా ఉంటూ ప్రజా సేవ చేస్తుంటారు.
#Narendra






