కర్నూలు : నంద్యాల : డోన్ :
డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన మొత్తం *రూ.31,38,412/-* (అక్షరాలా ముప్పై ఒక లక్షల ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల పన్నెండు రూపాయలు )విలువైన చెక్కులను గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,గడచిన 15 నెలల కాలంలో డోన్ నియోజకవర్గ పరిధిలోని ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని గౌరవ శాసనసభ్యులు తెలిపారు.
ఈ కాల వ్యవధిలో నియోజకవర్గానికి చెందిన మొత్తం 390 మంది లబ్ధిదారులకు రూ.4,02,49,951/-(అక్షరాల నాలుగు కోట్ల రెండు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఒకటి రూపాయలు)విలువైన ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే గారు వెల్లడించారు.
ఆరోగ్య చికిత్సలు, అత్యవసర వైద్య అవసరాలు, ప్రమాదాలు మరియు ఇతర సంక్షేమ కారణాల నిమిత్తం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఉపశమనం కలిగించిందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న దానికి ఇది నిదర్శనమని ఎమ్మెల్యే గారు అన్నారు.
భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం అందేలా తగిన చర్యలు తీసుకుంటామని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు.




